కరోనా కేసులు తగ్గితేనే స్కూళ్లు రీ ఓపెన్

కరోనా కేసులు తగ్గితేనే స్కూళ్లు రీ ఓపెన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గితే స్కూల్స్‌, కాలేజీలు రీ ఓపెన్ చేసేందుకు సర్కారు పర్మిషన్ ఇస్తుందని మంత్రి జగదీశ్‌​రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి చెప్పారు. రికగ్నైజ్డ్ ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్ల సంఘం (ట్రస్మా) ప్రతినిధుల బృందం బుధవారం మంత్రి జగదీశ్‌​ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డిలను వేర్వేరుగా కలిశారు. వెంటనే బడులు తెరువాలని, లేకపోతే స్టూడెంట్లకు భారీ నష్టమే జరుగుతుందని ట్రస్మా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కందాల పాపిరెడ్డి, ఎస్‌ఎన్​రెడ్డి  చెప్పారు. ఆన్‌లైన్​ క్లాసుల కారణంగా స్టూడెంట్ల లెర్నింగ్​లెవెల్స్ పడిపోయాయని తెలిపారు. ఫిజికల్ క్లాసులతో ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నారన్నారు. ఇలాంటి టైమ్‌లో ఎక్కువ రోజులు సెలవులు ఇస్తే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకుపోతానని జగదీశ్‌ రెడ్డి హామీ ఇచ్చారు.