- విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
మునుగోడు, వెలుగు: నియోజకవర్గ అభివృద్ధికి రూ.18 వేల కోట్లు ఇస్తే తాము ఎన్నికల్లో పోటీ చేయమని, ఇచ్చిన మాటకు నిలబడి విరమించుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పునరుద్ఘాటించారు.
మంగళవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని కిష్టాపురం, ఇప్పర్తి రావి గూడెం, జక్కలవారిగూడెం గ్రామాల్లో మాట్లాడుతూ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు జిమ్మిక్కులు చేస్తోందన్నారు. టీఆర్ఎస్ , అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ సుదర్శన్ రెడ్డి, టీఆర్ఎస్ లీడర్లు నారగోని రవి, భవనం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.