ప్రతి ఒక్కరూ దైవభక్తి పెంచుకోవాలి

  •  విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

యాదాద్రి, వెలుగు : ‘కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే చేదుగా ఉంటాయి.. మాలాంటి వాళ్లకు ఇబ్బందిగా ఉంటుంది.. కమ్యూనిస్టులు విడిపోకుండా ఉమ్మడిగా ఉంటే రాష్ట్రం, దేశ పరిస్థితులు వేరుగా ఉండేవి, వారి విభజన ఫలితం తెలంగాణ, దేశమూ అనుభవిస్తోంది’ అని విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లిలో శనివారం నిర్వహించిన రావి నారాయణరెడ్డి వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలను మతం మత్తులో ఉంచి తిరిగి మధ్యయుగంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ విలీనంపై కొందరు చరిత్రను వక్రీకరించే కుట్ర చేస్తున్నారన్నారు. ఉమ్మడి పాలకుల కారణంగా తెలంగాణ పోరాట యోధుల చరిత్ర వెలుగులోకి రాలేదన్నారు. భువనగిరి, నల్గొండలో రావి నారాయణరెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కవి, రచయిత కందిళ్ల ప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పల్లా వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, టీఆర్​ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ దైవభక్తి పెంచుకోవాలి
మునుగోడు, వెలుగు : నల్గొండ జిల్లా మునుగోడులోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శనివారం నిర్వహించిన మద్విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తి పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, మండల అధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి, మునుగోడు ఎంపీటీసీ బొడ్డు శ్రావణి నాగరాజుగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.