బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నారు: మంత్రి జగదీష్ రెడ్డి

బీజేపీ దుర్మార్గపు పరిపాలనను కర్ణాటక ప్రజలు తిరస్కరించారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీపై ప్రజలు కన్నేర్రజేస్తున్నారన్న ఆయన.. మోడీ పాలనపై ప్రజలు తిరగబడితే ఎలా ఉంటదనేది కర్ణాటక ఫలితాల్లో స్పష్టంగా అర్థమైందని తెలిపారు. ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా 9 రాష్ట్రాల్లో బీజేపీ అక్రమంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.  దేశంలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోందని అన్నారు. 

హనుమాన్ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు ఆంజనేయ స్వామివారి దేవాలయంలో మంత్రి కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.