నల్గొండ జిల్లా ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై మాట్లాడితే కాంగ్రెస్ నేతలు ఉలిక్కి పడుతున్నారన్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీకి, రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు పరిపాలనపై పూర్తిస్థాయిలో అవగాహన లేక.. చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మరోసారి బీఆర్ఎస్ కు అవకాశం ఇస్తే పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
దేవరకొండ నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలతో బీఆర్ఎస్ అభ్యర్థి రవీంద్ర నాయక్, చెరుకు సుధాకర్ తో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ మాటలకు, చేతలకు ఎలాంటి పొంతన ఉండదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 కు 12 నియోజకవర్గాలు BRS గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మీ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పండని కాంగ్రెస్ నేతలను ప్రజలు అడుగుతున్నారని అన్నారు.
- ALSO READ | కేసీఆర్ తోనే ప్రజా సంక్షేమం : జగదీశ్ రెడ్డి