సూర్యాపేట జిల్లా : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఆచరణ సాధ్యం కాని హామీలను తెలంగాణ ప్రజలెవరూ నమ్మరని చెప్పారు. కాంగ్రెస్ నాయకుల మాటలు బుడ్డార్ ఖాన్ మాటలన్నారు. కాంగ్రెస్ నాయకులు ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. హామీలు నెరవేర్చిన చరిత్ర లేదన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారం పొందాలనుకుంటున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన హామీని ప్రజలు నమ్మలేదన్నారు.
ALSO READ: ఎంఎన్జే ఆస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు: మంత్రి హరీష్రావు
అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో హామీలు నెరవేర్చకుండా తెలంగాణకు వచ్చి మాట్లాడితే రాష్ట్ర ప్రజలెవరూ నమ్మరని చెప్పారు. తెలంగాణతో సమానంగా బడ్జెట్ ఉన్న కర్ణాటకలో రైతుబంధు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మీద ఉన్న నమ్మకం ఉందని, కాంగ్రెస్ నాయకులపై నమ్మకం లేదన్నారు. ఇచ్చిన హామీలు మాత్రమే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. కేసీఆర్ పథకాలను కాపీ కొట్టి.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన స్క్రిప్టును సోనియాగాంధీ చదివారని ఆరోపించారు.