మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం

మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బీజేపీ మూడో స్థానానికే పరిమితమవుతుందని..కాంగ్రెస్ కు రెండో స్థానం కూడా డౌటేనన్నారు. కాంగ్రెస్ నాయకత్వ లేమితో బాధపడుతుందన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిని వెతుక్కునే దుస్థితిలో ఉందన్నారు.  నోటిఫికేషన్ ఇచ్చి నాయకుడిని వెతుక్కుంటున్నారన్నారు.  పార్టీని జోడించే పరిస్థితి లేదు కానీ భారత్ జోడో అంటూ నవ్వుల పాలవుతున్నారని ఎద్దేవా చేశారు.  

నాయకత్వ లేమితో బాధపడే పార్టీకి తెలంగాణలో ఎలాంటి అవకాశాలు లేవని జగదీశ్ రెడ్డి అన్నారు. బీజేపీ విభజన రాజకీయాలను తెలంగాణ సమాజం ఒప్పుకోదని అన్నారు. తెలంగాణకే కాదు భారత దేశానికే కేసీఆర్ నాయకత్వం శ్రీరామరక్ష అని అన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కేసీఆర్ నాయకత్వంలోనే దేశం ముందుకెళ్తుందన్నారు.