తెలంగాణలోని పథకాలు మోడీ సొంత రాష్ట్రంలోనూ లేవు : మంత్రి జగదీష్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా : నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత యాదాద్రి జిల్లానే ఎక్కువగా లాభపడిందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. చేపల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా లేవని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగుల కృషితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేందుకు ప్రతిపక్షాలు 300  కేసులు వేశాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం ముందు వారి ఆటలు సాగలేదన్నారు. ప్రజలు, అధికారులు కలిసి పనిచేసే సుపరిపాలన తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నారు.