బీజేపీ, కాంగ్రెస్​ నేతలకు మంత్రి జగదీశ్​రెడ్డి సవాల్​

సూర్యాపేట, వెలుగు : ఉద్యోగాల భర్తీ పై తాము చర్చకు సిద్ధమేనని, అందుకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు రెడీగా ఉన్నారా అని మంత్రి జగదీశ్​రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్ పర్సన్  దీపికాయుగంధర్ రావు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కిశోర్, సైదిరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లలో లక్షా 32 వేల 632 ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పదేండ్ల నుంచి పదివేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయినా నిరుద్యోగ మార్చ్​ అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్​ బీ-టీమ్​గా పనిచేస్తోందన్నారు.

అనంతరం ముస్లిములకు రంజాన్​తోఫా పంపిణీ, జిల్లా కేంద్రంలోని సత్యసాయి ధ్యాన మండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులను మంత్రి ప్రారంభించారు.