కేసీఆర్ లేడు కాబట్టే ఆంధ్రాలో అభివృద్ధి జరగలేదు : జగదీశ్ రెడ్డి

తెలంగాణకు కేసీఆర్ ఉన్నాడు కాబట్టే రాష్ట్రంలో అభివృద్ది జరుగుతోందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆంధ్రకు కేసీఆర్ లేడు కాబట్టే అక్కడ అభివృద్ది లేదని ఏపీ ప్రజలు అంటున్నరని ఆయన చెప్పారు. నేడు కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణ వైపు చూస్తున్నారని మంత్రి తెలిపారు. కేతపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసిఆర్ కిట్ ద్వారా ఎంతో మంది పేదలు లబ్ధి పొందారని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ రంగానికి రైతులకు 24 విద్యుత్ ఇస్తున్నామని.. పక్క రాష్ట్రాలలో కనీసం 6 నుండి 7 గంటలకు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. కేవలం రైతుబంధు డబ్బుల కోసమే తెలంగాణలో సరిహద్దు గ్రామాల రైతులు భూములు కొంటున్నరని జగదీశ్ రెడ్డి చెప్పారు.