మంత్రి జూపల్లి అమెరికా టూర్​

మంత్రి జూపల్లి అమెరికా టూర్​
  • ఐమెక్స్ 2024లో పాల్గొననున్న మంత్రి

హైదరాబాద్, వెలుగు: పర్యాట‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌‌‌‌ల్లి కృష్ణారావు ఆదివారం అమెరికాకు బయల్దేరారు. ఐమెక్స్​ అమెరికా 2024 పేరిట లాస్ వెగాస్ లో నిర్వహించ‌‌‌‌నున్న అతిపెద్ద వాణిజ్య ప్రద‌‌‌‌ర్శన‌‌‌‌లో మంత్రి పాల్గొననున్నారు. సోమవారం ఆయన వాషింగ్టన్  డీసీ చేరుకుంటారు. మంగళవారం లాస్ ఏంజెలెస్, 9, 10న‌‌‌‌ లాస్ వెగాస్, 11న అట్లాంటాలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో ఆయ‌‌‌‌న‌‌‌‌ పాల్గొంటారు. 12న తిరిగి భార‌‌‌‌త్ కు చేరుకొంటారు. ఈ వాణిజ్య ప్రదర్శనలో అమెరికా, ఇండియా, కెనడా, మెక్సికో, బ్రెజిల్, దుబాయ్  స‌‌‌‌హా ప‌‌‌‌లు దేశాలు పాల్గొన‌‌‌‌నున్నాయి.