ఎమ్మెల్సీ ఎన్నికలో నైతిక విజయం కాంగ్రెస్ దే: మంత్రి జూపల్లి 

ఎమ్మెల్సీ ఎన్నికలో నైతిక విజయం కాంగ్రెస్ దే: మంత్రి జూపల్లి 
  • ఎంపీ ఎన్నికల రిజల్ట్స్​ తరువాత బీఆర్ఎస్​ భూస్థాపితం: మంత్రి జూపల్లి

హైదరాబాద్, వెలుగు: మహబూబ్​నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్​ అభ్యర్థి నవీన్ కుమార్ గెలుపు సాంకేతికం మాత్రమేనని విమర్శించారు.

తమ పార్టీ.. ఆ పార్టీ మాదిరిగా తప్పుడు పద్ధతులు, ఫిరాయింపులకు పాల్పడలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం 1,437 ఓట్లు పోలైతే.. బీఆర్ఎస్​కు 762, కాంగ్రెస్​కు 653 వచ్చాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని తెలిపారు.

సెక్రటేరియెట్​ మీడియా సెంటర్​లో ఆదివారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డితో కలిసి జూపల్లి మీడియాతో మాట్లాడారు. ప్రజాభిప్రాయం మేర‌‌కు కొందరు బీఆర్ఎ స్ వాళ్లు కూడా కాంగ్రెస్ కు ఓటు వేశారన్నారు. దీంతో కాంగ్రెస్ కు 300 ఓట్లు అధికంగా వచ్చాయన్నారు. ఎంపీ ఎన్నికల రిజల్ట్స్​తరువాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందన్నారు.