హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీని గెలిపించాలన్నదే అందరి బాధ్యత, కర్తవ్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించి రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలని ప్రజలను కోరారు. శనివారం తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్జనజాతర సభలో ఆయన మాట్లాడారు. 2004లో ప్రధాని పదవిని కూడా సోనియా తిరస్కరించారని, 2009లో అవకాశం వచ్చి నా రాహుల్ పదవి కోసం పాకులాడలేదని గుర్తుచేశారు. కానీ, తెలంగాణను దోచుకోవడమే ధ్యేయంగా కేసీఆర్ కుటుంబం పని చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్కరికైనా పంటనష్టం ఇచ్చావా? అని కేసీఆర్ నిలదీశారు.