రాహుల్  స‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌ను సక్సెస్​ చేయాలి : జూప‌‌‌‌‌‌‌‌ల్లి కృష్ణారావు

రాహుల్  స‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌ను సక్సెస్​ చేయాలి : జూప‌‌‌‌‌‌‌‌ల్లి కృష్ణారావు

 

గ‌‌‌‌‌‌‌‌ద్వాల, వెలుగు: ఎన్నిక‌‌‌‌‌‌‌‌ల ప్రచారంలో భాగంగా ఈ నెల 5న గ‌‌‌‌‌‌‌‌ద్వాల జిల్లా ఎర్రవ‌‌‌‌‌‌‌‌ల్లిలో నిర్వహించే బ‌‌‌‌‌‌‌‌హిరంగస‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌కు రాహుల్​గాంధీ హాజరవుతారని, ఈ సభను సక్సెస్​ చేయాల‌‌‌‌‌‌‌‌ని మంత్రి జూప‌‌‌‌‌‌‌‌ల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. శుక్రవారం సభాస్థలి, హెలిప్యాడ్ , పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీళ్లు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.

బహిరంగసభకు ఉమ్మడి పాల‌‌‌‌‌‌‌‌మూరు జిల్లా నుంచి కాంగ్రెస్  శ్రేణులు, అభిమానులు తరలిరావాలని  కోరారు. ఈ  పార్లమెంట్ ఎన్నిక‌‌‌‌‌‌‌‌లు చారిత్రాత్మక‌‌‌‌‌‌‌‌మైన‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ని, కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి రావాల్సిన  అవ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ం ఉందన్నారు. పొర‌‌‌‌‌‌‌‌పాటున బీజేపీ మ‌‌‌‌‌‌‌‌ళ్లీ అధికారంలోకి వ‌‌‌‌‌‌‌‌స్తే రాజ్యాంగాన్ని మార్చడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను  ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుంద‌‌‌‌‌‌‌‌ని తెలిపారు.

కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి వ‌‌‌‌‌‌‌‌చ్చిన త‌‌‌‌‌‌‌‌ర్వాత  కుల గ‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌న చేప‌‌‌‌‌‌‌‌ట్టి  దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామ‌‌‌‌‌‌‌‌న్నారు. ఉత్తరాదిలో ప్రధాని మోదీ గ్రాఫ్  ప‌‌‌‌‌‌‌‌డిపోయింద‌‌‌‌‌‌‌‌ని, అందుకే ద‌‌‌‌‌‌‌‌క్షిణాది రాష్ట్రాలపై ఫోక‌‌‌‌‌‌‌‌స్  చేశార‌‌‌‌‌‌‌‌న్నారు. ప‌‌‌‌‌‌‌‌దేండ్ల మోదీ పాల‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌లో విద్య, వైద్యం, మౌలిక వ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌తుల‌‌‌‌‌‌‌‌ క‌‌‌‌‌‌‌‌ల్పన జ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌లేద‌‌‌‌‌‌‌‌ని, నిరుద్యోగం పెరిగింద‌‌‌‌‌‌‌‌ని, ద‌‌‌‌‌‌‌‌ళితులు, బ‌‌‌‌‌‌‌‌డుగు, బ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌హీనవ‌‌‌‌‌‌‌‌ర్గాల జీవ‌‌‌‌‌‌‌‌న ప్రమాణాల్లో ఎలాంటి మార్పు లేద‌‌‌‌‌‌‌‌ని చెప్పారు. వ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌ర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, గద్వాల జ‌‌‌‌‌‌‌‌డ్పీ చైర్ ప‌‌‌‌‌‌‌‌ర్సన్  స‌‌‌‌‌‌‌‌రిత పాల్గొన్నారు. 

సీఎం సభాస్థలిని పరిశీలించిన ఎస్పీ

సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాందీ పర్యటన సందర్భంగా ఎర్రవెల్లి సభాస్థలి, హెలిపాడ్ లను ఎస్పీ రితిరాజ్ పరిశీలించారు. బందోబస్తు కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ గుణశేఖర్, బెటాలియన్  కమాండెంట్  సాంబయ్య, డీఎస్పీలు సత్యనారాయణ, నరేందర్, ఆలంపూర్  సీఐ రవిబాబు ఉన్నారు.