వనపర్తి హత్యా ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోణలను తీవ్రంగా ఖండించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పూర్తి వివరాలు తెలియకుండా కేటీఆర్ మా హస్తం ఉందని ఎలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డి హత్యను తాను కూడా ఖండిస్తున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి దోషులకు శిక్ష పడేలా చేస్తా మన్నారు. ఆ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
అనవసరంగా ఆరోపణలు చేస్తే కేటీఆర్ పై పరువు నష్ట దావా వేస్తానన్నారు. జూపల్లి కృష్ణారావుకి నేరచరిత్ర లేదని తెలిపారు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. మంత్రిపై హత్యా రాజకీయం చేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేసిన వారందరూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.