బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి... జూపల్లి కృష్ణారావు

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి శనివారం బుద్ధవనాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్ధుడి జీవిత చరిత్రను ఆవిష్కరించేలా బుద్ధవనాన్ని నిర్మించడం గొప్ప విషయం అన్నారు. ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం వల్ల ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆ దిశగా పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.

ఇందులో భాగంగా ట్రెక్కింగ్, చిల్డ్రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లే గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ముందుగా హిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీలోని విజయవిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రికి పర్యాటక అభివృద్ధి సంస్థ జీఎం ఉపేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీఎం జీఎం నాదన్, టూరిజం డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా అధికారి శివాజి స్వాగతం పలికారు. బుద్ధవనంలో ఓఎస్డీ సూదన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈమని శివనాగిరెడ్డి మంత్రికి బొకే అందజేశారు. బుద్ధుడి పాదుకల వద్ద శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం కొత్తగా ఏర్పాటు చేయనున్న వ్యూ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు.

అనంతరం బుద్ధవనం అభివృద్ధి, వసతుల కల్పనపై రివ్యూ చేశారు. పర్యాటకులకు ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వారి వెంట నల్గొండ జడ్పీ మాజీ వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్నాటి లింగారెడ్డి, నందికొండ మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నపూర్ణ, ఆఫీసర్లు కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హరి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.