హైదరాబాద్: కాంగ్రెస్అగ్ర నేతలు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలో వచ్చే నెల 31లోగా కులగణన చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లుగా మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. జనాభా దామాషా ప్రకారమే పదవులు ఉంటాయన్నారు. ఇవాళ గాంధీభవన్‌లో ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. కులగణనలో సామాజికవర్గాలవారీగా ఎంత మంది ఉన్నారో నిష్పత్తి ప్రకారం వివరాలు నమోదు చేస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ‘ కేటీఆర్, హరీష్ రావు ప్రతి అంశం పట్ల రాజకీయం చేస్తున్నారు. రాజకీయ లబ్దికోసం ఉన్నదాన్ని లేనట్టుగా.. లేని దాన్ని ఉన్నట్టుగా ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధిపొందుతున్నారు. మంత్రిగా ఉన్న నేనే మూసీ రివర్ బెల్ట్‌లో ఉన్నాను.
ఏసీలో ఉన్న.. నాకే పరిసరాలు కంపు వస్తుంది. పది నెలల్లో 50 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించాం.. మీ హయాంలో కనీసం డీఎస్సీ వేశారా..? ప్రభుత్వం మూడు నెలల్లో కూలుతుందని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ఆర్టీసీ మూసేసీ అడుక్కుతినే స్థాయికి చేశాడు అది కేసీఆర్నైజం. ధనిక రాష్ట్రం అంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు అప్పుల కుప్పలగా ఎందుకు మారింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అన్ని ఫండ్స్ఎక్కడి నుండి వచ్చాయి. జాతీయ కాంగ్రెస్ పార్టీకి లేనన్ని నిధులు బీఆర్ఎస్ పార్టీకి అవినీతి అక్రమల మార్గంలోనే వచ్చాయి. బీఆర్ఎస్కు ఎంపీ ఎన్నికల్లో సున్న సీట్లు ఇచ్చి బుద్ది చెప్పిన వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు’ అని జూపల్లి అన్నారు.