గంజాయి, డ్రగ్స్‌, సారా అమ్మకాలపై నిఘా పెట్టాలి

గంజాయి, డ్రగ్స్‌, సారా అమ్మకాలపై నిఘా పెట్టాలి

బండ్లగూడ కిస్మత్​పురాలోని ఎక్సైజ్​ అకాడమిని  ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు  ఆకస్మిక త‌నిఖీ చేశారు.  అకాడమీ పనితీరును అధికారులు మంత్రికి వివరించారు. శిక్షణ పొందుతున్న 129 మంది మహిళా కానిస్టేబుళ్లతో మాట్లడుతూ ..  సమాజ శ్రేయస్సుకు మాదకద్రవ్యాల నియంత్రణ ఎంతో ముఖ్యమని, గంజాయి, డ్రగ్స్‌, అక్రమ మద్యం, సారా అమ్మకాలు, రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి, వాటి  బారి నుంచి యువతను కాపాడేందుకు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఉద్బోధించారు. మాదకద్రవ్యాల సరఫరా, వినియోగించే వారి సమాచారాన్ని  తెలుసుకొవ‌డం ద్వారా, వాటి మూలాల నుంచి అరికట్టాల‌ని అన్నారు. 

Also Read :- 2 వేల 700 కోట్లతో.. రెండేళ్లలో కొత్త ఉస్మానియా ఆస్పత్రి రెడీ

మంత్రి జూపల్లికి అకాడమీ డైరెక్టర్‌ అజయ్ రావు, ఇతర అధికారులు  స్వాగతం పలికారు.  శిక్షణ తరగతుల్లో చెప్పుతున్న పాఠాలు, ఫిజికల్ ట్రైనింగ్ గురించి వివరించారు.  అకాడమీలో భోజనం ఎలా ఉందని, నీటి సమస్య  ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. అకాడమీలో అందుతున్న సేవలు, అక్కడి సౌకర్యాలు , శిక్షణ తరగతులు, ఇతర అంశాల గురించి శిక్షణ పొందుతున్న ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్స్ ను అడిగి తెలుసుకున్నారు.  ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ట్రైనీ  కానిస్టేబుళ్లకు సూచించారు. సమాజానికి మేలు చేసేలా సేవలు అందించాలని, అంకితభావంతో  పని చేయాలని కోరారు.