శాంతివనానికి ఏ సాయం కావాలన్నా చేస్తం :మంత్రి జూపల్లి కృష్ణారావు

శాంతివనానికి ఏ సాయం కావాలన్నా చేస్తం :మంత్రి జూపల్లి కృష్ణారావు
  • ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు  

షాద్ నగర్, వెలుగు: ప్రపంచం మనుగడ  కేవలం శాంతి, సామరస్యాలతోనే కొనసాగుతుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం ఇంటర్నేషనల్ యూత్ కైండ్ నెస్ సెమినార్ ముగింపు సమావేశానికి మంత్రి జూపల్లి హాజరై మాట్లాడారు. యువతను దృష్టిలో పెట్టుకొని నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ సెమినార్ కు దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన ప్రతినిధులతో కన్హా శాంతివనం కళకళలాడుతోందని తెలిపారు. ఒకప్పుడు ఈ ప్రాంతం ఖాళీ స్థలాలతో బీడు వారినట్టు కనిపించేదని, ఇప్పుడు కన్హా శాంతి వనం ఏర్పాటయ్యాక అందమైన ప్రదేశంగా మారిపోయిందని చెప్పారు. ప్రభుత్వం తరఫున ఏ సహాయం కావాలన్నా తప్పకుండా చేస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి మొక్కలు నాటారు.