
హైదరాబాద్: హెచ్సీయూలో ఒక్క ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదని.. 400 ఎకరాల భూమి వెనక పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్అయ్యారు.
ALSO READ | కంచె గచ్చిబౌలి భూములపై నివేదికివ్వండి..తెలంగాణకు కేంద్రం ఆదేశం
గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఒక ప్రైవేట్ కంపెనీకి భూమి దక్కకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడింది. దానికి 400 ఎకరాలు వెళ్తే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు ఇబ్బంది అనిపించలేదు. చెట్లు పెరిగితే అడవి అయిపోతుందా? 20 ఏండ్ల నుంచి పడావుగా ఉన్న భూమిలో చెట్లు పెరుగుతాయి కదా. హెచ్సీయూలో పులులు, జింకలను ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు తపన పడుతున్నారు. భూమి తీసుకున్నందుకు భూమిని యూనివర్సిటీకి ఇచ్చారు’ అని తెలిపారు.