నిజామాబాద్, వెలుగు: బీఆర్ఎస్ సర్కార్ మధ్యలోనే ఆపేసిన పనులన్నీ ప్రజాపాలనలో పూర్తి చేస్తున్నామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఇందులో జిల్లాలో తాగునీటి స్కీమ్‌లు, శానిటేషన్పనులు ఉన్నాయన్నారు. ఆదివారం ఆయన రూ.400 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పాత కలెక్టరేట్ వద్ద నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తాగునీటి వ్యవస్థ మెరుగు పరిచేందుకు రూ. 217 కోట్లు మంజూరు చేశామన్నారు.
ప్రతి రోజూ 2.5 కోట్ల లీటర్ల నీటిని క్లీనింగ్చేసి శుద్ధ జలాలు ప్రజలకు సరఫరా అయ్యేలా సిటీలో18 ట్యాంకులు కొత్తగా నిర్మిస్తామన్నారు. అలీసాగర్వద్ద 25ఎంఎల్డీ కెపాసిటీతో స్టోరేజ్ట్యాంకులు కడతామన్నారు. అదేవిధంగా సిటీలో శానిటేషన్ మెరుగుపర్చేందుకు అండర్‌గ్రౌండ్‌డ్రైనేజీ సిస్టమ్ కు రూ.162 కోట్ల నిధులు ఖర్చు చేసి పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. ఆయా పనులను గత పాలకులు మధ్యలో వదిలేశారని విమర్శించారు.
వాటర్ స్కీం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఏడాదిన్నరలో పూర్తయ్యేలా ఆఫీసర్లు ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. నిష్ణాతులైన టీచర్లను అపాయింట్ చేసిన సర్కారు బడుల్లో పిల్లలను చదివించాలని పేరెంట్స్‌కు సూచించారు. ఖర్చుతో కూడిన ప్రైవేట్‌స్కూళ్లకు దూరంగా ఉండాలన్నారు. ప్రజలు తమ జీవన శైలిని ఆరోగ్యకరంగా మార్చుకొని యోగా, వ్యాయామానికి ప్రయారిటీ ఇవ్వాలని సూచించారు.
మైనారిటీ కమిషన్ చైర్మన్తారీక్ అన్సారీ, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, మేయర్ దండు నీతూకిరణ్, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ. స్టేట్కార్పొరేషన్ చైర్మన్లు తాహెర్, మానాల మోహన్‌రెడ్డి, అన్వేశ్‌రెడ్డి, అగ్రికల్చర్ కమిషన్మెంబర్గడుగు గంగాధర్, జిల్లా లైబ్రరీ కమిటీ చైర్మన్అంతిరెడ్డి రాజిరెడ్డి, మార్కెట్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నగర పాలక కమిషనర్ దిలీప్‌కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి తదితరులు ఉన్నారు.