ఆలయాల్లో మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు

కొల్లాపూర్, వెలుగు: కొల్లాపూర్  పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం ఆవరణలో సోమవారం నిర్వహించిన భోగి ఉత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు మంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అనంతరం భోగి సందర్భంగా పట్టణంలోని పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. మాధవ స్వామి ఆలయం, రామ మందిరాన్ని దర్శించుకున్నారు.