లక్నవరం ఊటీ, సిమ్లాలను తలపిస్తుంది : జూపల్లి

లక్నవరంలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. లక్నవరంకు వస్తే స్వర్గధామంకు వచ్చినట్లు ఉంటుందని, లక్నవరం సిమ్లా, ఊటీలను తలపిస్తుందని అన్నారు. లక్నవరం పర్యాటక ప్రాంతాన్ని ఫ్రీ కౌట్స్ అనే సంస్థ కు 15 సంవత్సరాలు లీజ్ కు ఇవ్వడం జరిగిందని అన్నారు. చుట్టూ గుట్టలు ,దట్టమైన అడవి తో ఈ ప్రాంతం సుందరంగా ఉందని అన్నారు. లక్నవరంలో 5 స్విమ్మింగ్ పూళ్ళు,పెద్దల కోసం రెస్టారెంట్లన్నాయని అన్నారు. 

Also Read :- ప్రజలనే కాదు.. వేములవాడ రాజన్నను KCR మోసం చేసిండు

లక్నవరం సిమ్లా, ఊటి లను తలపిస్తుందని, దట్టమైన అటవీ ప్రాంతంలో లక్నవరం అందాలను వీక్షించవచ్చని అన్నారు జూపల్లి. టూరిస్టులు ఆకర్షించే విధంగా లక్నవరంలో వాటర్ స్పోర్ట్స్ డెవలప్ చేస్తామని అన్నారు. ములుగు జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. తెలంగాణ ప్రాంతం పర్యాటక కేంద్రంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు.