గ్రంథాలయాలతోనే సమాజంలో మార్పు : మంత్రి జూపల్లి కృష్ణారావు 

గ్రంథాలయాలతోనే సమాజంలో మార్పు : మంత్రి జూపల్లి కృష్ణారావు 

షాద్ నగర్, వెలుగు: గ్రంథాలయాలతో సమాజంలో మార్పు తీసుకురావచ్చని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. సోమవారం షాద్​నగర్​లో గ్రేడ్ వన్ శాఖ గ్రంథాలయ అభివృద్ధి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభ జరిగింది. మంత్రి జూపల్లి, ఎమ్మెల్సీ కోదండరాం, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. గ్రంథాలయ కమిటీ చైర్మన్​గా కె.మదన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో విద్య, వైద్యానికి 80 శాతం నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాతే మిగతా పనులను చూస్తానన్నారు. సంస్కారం లేని జీవితం, విద్య వ్యర్థమని, చదువుతోపాటు సంస్కారం నేర్పించాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వం డిజిటలైజేషన్ ను ప్రోత్సహిస్తోందని చెప్పారు. షాద్ నగర్ గ్రంథాలయానికి తన శాఖ తరఫున రూ.5 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, రఘునాయక్, బాలరాజ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.