ఎక్సైజ్ ఆదాయం పెంచండి : మంత్రి జూపల్లి

ఎక్సైజ్ ఆదాయం పెంచండి : మంత్రి జూపల్లి
  • అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఎక్సైజ్ ఆదాయం పెంచాలని అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. గత ప్రభుత్వం మాదిరి  ఎక్కువ మద్యం అమ్మాలని ఒత్తిడి తీసుకురావడం లేదని.. కాకపోతే గతంలో జరిగిన లీకేజీలను ఆరికట్టి లిక్కర్​ రాబడి పెంచాలని సూచించారు. 

శుక్రవారం నాంపల్లిలోని ఎక్సైజ్​ శాఖ ఆఫీస్​లో అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు.  గుడుంబాను నిర్మూలించాలని ఆదేశించారు. గ్రామాల్లో బెల్ట్​ షాప్​లపై నిఘా పెంచాలన్నారు. డ్రగ్స్​, గంజాయిపై టాస్క్​ఫోర్స్​ దాడులను పెంచాలని ఆదేశించారు. ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.