రైతులను ఇబ్బంది పెడ్తే కఠిన చర్యలు : మంత్రి జూపల్లి కృష్ణారావు 

రైతులను ఇబ్బంది పెడ్తే కఠిన చర్యలు : మంత్రి జూపల్లి కృష్ణారావు 
  • కొండూరు గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కొల్లాపూర్, వెలుగు: మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం పెంట్లవెల్లి మండల పరిధిలోని కొండూరు గ్రామంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి  ప్రారంభించారు.  ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని మంత్రి సూచించారు.  కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణానదిలో 5 లక్షల చేప పిల్లలు వదిలేందుకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి జూపల్లి నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి హాజరయ్యారు.

సప్లై చేసిన చేప పిల్లలు నాసిరకంగా ఉన్నాయని మత్స్యశాఖ అధికారులపై మంత్రి  ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ లో వదిలేందుకు మూడు నుంచి నాలుగు ఇంచుల సైజు చేపపిల్లలు ఉండాలన్నారు. చిన్నగా ఉన్న చేపపిల్లలను తిరిగి వెనక్కి పంపించాలని  మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కృష్ణానది తీరంలో ఏర్పాటు చేసిన స్నానపు గదులు, బాత్రూంలను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో పర్యాటకశాఖ జిల్లా అధికారి కలవరాల నరసింహ, మత్స్య శాఖ ఏడీ, మత్య్సకారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.