శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ పర్యాటక శాఖ ఆఫీసును మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ప్రారంభించారు. పర్యాటకులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు, హరిత హోటల్స్, టూర్ ప్యాకేజీలు, రిజర్వేషన్, రూట్ మ్యాప్ అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్ర పర్యాటక సంస్థ బషీర్‌బాగ్, బేగంపేట టూరిజం ప్లాజా, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ యాత్రినివాస్, శిల్పారామంతోపాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సమాచార, రిజర్వేషన్ కేంద్రాలను నిర్వహిస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో టూరిజం డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, ఎయిర్పోర్ట్సీఈఓ ప్రదీప్ ఫణిక్కర్, టూరిజం ఎండీ ప్రకాశ్‌రెడ్డి, డైరెక్టర్జెండగే హనుమంతు కొండిబా తదితరులు పాల్గొన్నారు.