వివేకాన్ని అందించే చదువు కావాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

వివేకాన్ని అందించే చదువు కావాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్, వెలుగు: ఉద్యోగం కోసం కాకుండా విజ్ఞానంతో పాటు వివేకాన్ని అందించేలా విద్య ఉండాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మండలంలోని సింగోటంలో రూ.40 ల‌‌‌‌‌‌‌‌క్షలతో ఆధునీక‌‌‌‌‌‌‌‌రించిన ప్రైమరీ, జ‌‌‌‌‌‌‌‌డ్పీ హైస్కూల్​ బిల్డింగ్​లను కలెక్టర్  బదావత్​ సంతోష్ తో కలిసి ప్రారంభించారు. అనంత‌‌‌‌‌‌‌‌రం స్టూడెంట్స్, పేరెంట్స్​తో ‘చ‌‌‌‌‌‌‌‌ర్చిద్దాం.. విద్యార్థుల భ‌‌‌‌‌‌‌‌విష్యత్  కోసం’ కార్యక్రమంలో భాగంగా ముఖాముఖి నిర్వహించారు. పిల్లల‌‌‌‌‌‌‌‌ చ‌‌‌‌‌‌‌‌దువులు, భ‌‌‌‌‌‌‌‌విష్యత్  కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై స‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌హాలు, సూచ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌లు స్వీకరించారు. ఈ సంద‌‌‌‌‌‌‌‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధ‌‌‌‌‌‌‌‌న అందిస్తామ‌‌‌‌‌‌‌‌ని, అన్ని సౌలతులు కల్పిస్తామని తెలిపారు.

క్రీడ‌‌‌‌‌‌‌‌లు, సాంస్కృతిక కార్యక్రమాల‌‌‌‌‌‌‌‌ను ప్రోత్సహిస్తామ‌‌‌‌‌‌‌‌ని చెప్పారు. నియోజ‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ర్గంలో రూ.10 కోట్ల ప్రత్యేక నిధుల్లో రూ. 8 కోట్లు విద్యాభివృద్ధికే కేటాయించిన‌‌‌‌‌‌‌‌ట్లు చెప్పారు. తమ పిల్లలకు చ‌‌‌‌‌‌‌‌దువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ నేర్పించాల్సిన అవ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌రం ఉంద‌‌‌‌‌‌‌‌న్నారు.  నియోజకవర్గంలోని అన్ని హైస్కూళ్లకు ఇంగ్లీష్​ పేపర్లు, డిక్షనరీలను అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కు సూచించారు. సింగోటం గ్రామంలో ప్రతి ఇంటిపై సోలార్  విద్యుత్  ప్లాంట్  ఏర్పాటు చేసేందుకు సీఎస్ఆర్  నిధుల నుంచి రూ.కోటి మంజూరు చేసేందుకు మంత్రి అంగీకరించారు. అనంతరం కొల్లాపూర్  పోలీస్ స్టేషన్​లో కోడేరు, కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన 100 సీసీ కెమెరాలను కలెక్టర్, ఎస్పీ వైభవ్  రఘునాథ్ తో కలిసి ప్రారంభించారు. 

సింగోటం జాతరపై రివ్యూ..

ఈ నెల14 నుంచి 21 వరకు జరిగే లక్ష్మీనర్సింహస్వామి ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి జూపల్లి సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి జాతర ఏర్పాట్లపై ఆలయం ఆవరణలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.  తెలంగాణ, ఏపీ, కర్నాటక రాష్ట్రాల నుంచి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌలతులు కల్పించాలని ఆదేశించారు. పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌‌‌‌‌‌‌‌  సరఫరాపై ఫోకస్​ పెట్టాలన్నారు.

ఎలాంటి తొక్కిసలాట, ఇబ్బందులు తలెత్తకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. ముందుగా స్వామి వారిని మంత్రి, కలెక్టర్  దర్శించుకున్నారు. అడిషనల్​ కలెక్టర్  దేవసహాయం, డీపీవో రామ్మోహన్ రావు, ఆర్డీవో బన్సీలాల్, డీఈవో రమేశ్​కుమార్  పాల్గొన్నారు.

లైబ్రరీ డెవలప్​మెంట్​పై దృష్టి పెట్టాలి

నాగర్ కర్నూల్ టౌన్ : జిల్లాలో లైబ్రరీల డెవలప్​మెంట్​కు కృషి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. సోమవారం లైబ్రరీ చైర్మన్  రాజేందర్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రంథాలయ సంస్థ అభివృద్ధి కోసం తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. దాతలు పుస్తకాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్​ అందించాలని కోరారు. మార్కెట్  చైర్మన్ గా రమణారావు ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీ కృష్ణ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.

చెక్కులు అందజేత..

కోడేరు : పెద్దకొత్తపల్లి తహసీల్దార్  ఆఫీస్​లో 105 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కాంగ్రెస్  పార్టీ పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలోని పేదలందరికీ అండగా ఉంటుందన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతుబీమా, పంట బీమా పథకాలతో రైతులను ఆదుకుంటుందన్నారు. ఆర్డీవో బన్సీలాల్, తహసీల్దార్  జేకే మోహన్, మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్  పాల్గొన్నారు.