హుస్సేన్ సాగ‌‌‌‌‌‌‌‌ర్​లో వాట‌‌‌‌‌‌‌‌ర్ స్పోర్ట్స్

  • రాష్ట్రంలో జల పర్యాటకాన్ని ప్రోత్సహిస్తం: మంత్రి జూప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లి
  • జెట్ స్కీపై హుస్సేన్ సాగ‌‌‌‌‌‌‌‌ర్​లో విహరించిన మంత్రి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు జల పర్యాటకం, సాహ‌‌‌‌‌‌‌‌స క్రీడ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌కు సరికొత్త రూపు సంతరించుకునేలా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంద‌‌‌‌‌‌‌‌ని మంత్రి జూప‌‌‌‌‌‌‌‌ల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బుధవారం హుస్సేన్ సాగ‌‌‌‌‌‌‌‌ర్ లో  అమ‌‌‌‌‌‌‌‌రావ‌‌‌‌‌‌‌‌తి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో వాట‌‌‌‌‌‌‌‌ర్ స్పోర్ట్స్ ను  మంత్రి ప్రారంభించారు. తర్వాత టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప‌‌‌‌‌‌‌‌టేల్ ర‌‌‌‌‌‌‌‌మేశ్ రెడ్డితో క‌‌‌‌‌‌‌‌లిసి ఆయన  జెట్ స్కీ పై హుస్సేన్ సాగ‌‌‌‌‌‌‌‌ర్ లో విహరించారు. ఈ సంద‌‌‌‌‌‌‌‌ర్భంగా జూప‌‌‌‌‌‌‌‌ల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో వాటర్ స్పోర్ట్స్ కు ప్రజాదరణ పెరుగుతుందని, జల పర్యాటకాన్ని ప్రోత్సహించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

కృష్ణా న‌‌‌‌‌‌‌‌ది ప‌‌‌‌‌‌‌‌రివాహక ప్రాంతంలోని సోమ‌‌‌‌‌‌‌‌శిల బ్యాక్ వాట‌‌‌‌‌‌‌‌ర్స్, నాగ‌‌‌‌‌‌‌‌ర్జున సాగ‌‌‌‌‌‌‌‌ర్, ఇత‌‌‌‌‌‌‌‌ర రిజర్వాయ‌‌‌‌‌‌‌‌ర్లు, హుస్సేన్ సాగ‌‌‌‌‌‌‌‌ర్​ను తీర్చిదిద్దితే జ‌‌‌‌‌‌‌‌ల పర్యాటక రంగం బాగా డెవలప్ అయితుంద‌‌‌‌‌‌‌‌న్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప‌‌‌‌‌‌‌‌ర్యాట‌‌‌‌‌‌‌‌క రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మౌలిక వ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌తులు క‌‌‌‌‌‌‌‌ల్పిస్తామన్నారు. హుస్సేన్ సాగ‌‌‌‌‌‌‌‌ర్ లో పెద్దలు, పిల్లలు క‌‌‌‌‌‌‌‌లిసి వాట‌‌‌‌‌‌‌‌ర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేసేలా జెట్ స్కీ, క‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌క్, జెట్ అటాక్, వాట‌‌‌‌‌‌‌‌ర్ రోల‌‌‌‌‌‌‌‌ర్ (జాబింగ్) ను అందుబాటులోకి తెచ్చిన‌‌‌‌‌‌‌‌ట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్​ ప్రకాశ్​రెడ్డి, అమ‌‌‌‌‌‌‌‌రావ‌‌‌‌‌‌‌‌తి బోటింగ్ క్లబ్ ​సీఈవో త‌‌‌‌‌‌‌‌రుణ్ కాకాని త‌‌‌‌‌‌‌‌దిత‌‌‌‌‌‌‌‌రులు పాల్గొన్నారు.