- మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, వెలుగు : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. పట్టణంలోని మినీ స్టేడియంలో సోమవారం 68వ ఎస్జీఎఫ్ డివిజన్ స్థాయి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమనే విషయాన్ని గుర్తించాలన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సానుకూలంగా స్వీకరించాలన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటాలని ఆకాక్షించారు. అనంతరం క్యాంప్ ఆఫీస్లో కొల్లాపూర్, కోడేరు, వీపనగండ్ల, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి
చిన్నంబావి మండలాలకు చెందిన 88 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ డబ్బుల మంజూరు కోసం డబ్బులు అడిగితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. తమ దగ్గర డబ్బులు తీసుకున్నారని ఓ లబ్ధిదారుడు మంత్రి దృష్టికి తీసుకురాగా, విచారణ జరిపి కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని, ఇలాంటి చర్యలను క్షమించే ప్రసక్తే లేదన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు, ఆర్డీవో నాగరాజు పాల్గొన్నారు.