కొల్లాపూర్, వెలుగు: కొల్లాపూర్ పట్టణంలోని రాణి ఇందిరాదేవి స్కూల్లో రిపేర్ పనులను ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. స్కూల్ రిపేర్ల కోసం ఇటీవల ఫండ్స్ మంజూరు చేశారు. ఆ పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా నాణ్యత లోపించకుండా పనులు చేయాలని సూచించారు.
నియోజకవర్గంలోని స్కూల్స్ డెవలప్మెంట్ కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ రమ్య, నాగరాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.