హైదర్గూడలోని పర్యాటక భవన్ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. హాజరు పట్టిక, బయో మెట్రిక్‌లో అటెండెన్స్ పరిశీలించారు మంత్రి. ప్రతీ ఫ్లోర్ తిరిగి ఉద్యోగులు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖాళీ కుర్చీలే ఎక్కువగా దర్శనం ఇవ్వడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆఫీస్‌కి సమయానికి రాని అధికారులపై ఆయన ఫైరయ్యారు. అంతా మీ ఇష్టమేనా అంటూ అధికారులను నిలదీశారు జూపల్లి.
ఆఫీసు టైమింగ్స్ పాటించకపోవడం, హాజరు శాతం తక్కువగా ఉండటంతో.. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జూపల్లి . హాజరు శాతం, ఉద్యోగులు పనితీరుపై సమీక్ష నిర్వహిస్తామన్నారు జూపల్లి. ఉద్యోగుల గత 12 నెలల హాజరు వివరాలు ఇవ్వాలని మంత్రి జూపల్లి ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికాల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకూ అందరికీ బయోమెట్రిక్ విధానం అమలు చేయాలన్నారు.