కొల్లాపూర్ మున్సిపాలిటీ  డెవలప్ మెంట్‌కు కృషి చేస్తా  : మంత్రి జూపల్లి కృష్ణారావు 

కొల్లాపూర్ మున్సిపాలిటీ  డెవలప్ మెంట్‌కు కృషి చేస్తా  : మంత్రి జూపల్లి కృష్ణారావు 
  •   20 వార్డుల్లో రూ. 8 కోట్ల  
  • పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు 

కొల్లాపూర్, వెలుగు: కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల్లో రూ.8 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వివిధ అభివృద్ధి పనులకు శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ..   సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందని పేర్కొన్నారు.  మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.

 కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మేకల రమ్య కుమారి నాగరాజు, వైస్ చైర్మన్ మహిమూదా బేగం ఖాదర్ పాషా, తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోడేర్, చిన్నంబావి మండలాలకు మంజూరైన 108 అంబులెన్స్ లను  పట్టణంలోని  మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మంత్రి జూపల్లి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్ దాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు జూపల్లి రఘుపతి రావు, మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్ రావు,బీచుపల్లి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.