కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు లేని పాలన అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. 2024 జనవరి 03 గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తాగునీరు, ఆరోగ్యం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై సమీక్ష సమావేశంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ రాక్షసిపాలన పోయి.. ప్రజలు కోరుకున్న కాంగ్రెస్ పాలన వచ్చిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రజలు, అమరవీరుల ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన జరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వంలో మంచినీటి కోసం రూ. 40వేల కోట్లు ఖర్చు చేశారని... ఆ మంచినీటి పథకం సక్రమంగా జరగలేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలను కచ్చితంగా వెలికి తీస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు లేని పాలన అందిస్తామని పేర్కొన్నారు. మంచినీరు, ఆరోగ్యం, ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై సమీక్ష సమావేశంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. గత ప్రభుత్వానికి భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంచి పరిపాలన అందిస్తామని మంత్రి జూపల్లి చెప్పారు.