
నాగర్ కర్నూలు ఎస్ఎల్ బీసీ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్టీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్ టెక్నికల్ టీమ్ ను రప్పించేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు మంత్రులను అడిగి సమాచారం తెలుసుకుంటున్నారు . మంత్రులు ఉత్తమ్,జూపల్లి ఎప్పటికప్పుడు అధికారులు,రెస్క్యూ టీంతో మాట్లాడుతున్నారు.
రెస్క్యూ టీంతో టన్నెల్ లోపలికి వెళ్లారు మంత్రి జూపల్లి దాదాపు 13కి.మీ వరకు లోపలికి వెళ్లారు. ఇంకో అర కిలోమీటర్ వెళ్లాల్సి ఉండగా..మట్టి నీరు ఉండటంతో వెనక్కి వచ్చారు. టన్నెల్ లో పైకప్పు కూలడంతో 12 ఫీట్ల మేర మట్టి బురద చేరుతోందన్నారు మంత్రి జూపల్లి. రెస్క్యూ టీం ఇంకా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడుతామని మంత్రి ఉత్తమ్ అన్నారు. 8 మందిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
మరో వైపు ఎస్ఎల్ బీసీ ప్రమాదంపై రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. ఇద్దరు నేతలు దాదాపు 20 నిమిషాలు మాట్లాడుకున్నారు.