రైతులకు పంట రుణాలు ఇవ్వాలి : జూపల్లి కృష్ణరావు

రైతులకు పంట రుణాలు ఇవ్వాలి : జూపల్లి కృష్ణరావు

వీపనగండ్ల, వెలుగు: రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసి రైతులకు తిరిగి రుణాలు ఇవ్వాలని మంత్రి జూపల్లి కృష్ణరావు సూచించారు. బుధవారం బ్యాంక్​ మేనేజర్​తో రుణమాఫీ వివరాలను తెలుసుకున్నారు. బ్యాంక్​ పరిధిలో రూ. 36.60 కోట్లు మాఫీ కావాల్సి ఉందని మేనేజర్​ రవీందర్​బాబు తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే రైతులను ఇబ్బంది పెట్టకుండా, అర్హుల లిస్ట్​ను తయారు చేసి అందించాలని మంత్రి సూచించారు. బ్యాంకులో రుణాలు పెండింగ్​లో లేకుండా చూసుకోవాసిన బాధ్యత రైతులపై ఉందన్నారు. మంత్రి వెంట గోదల బీరయ్య, రవీందర్ రెడ్డి,  నక్క విష్ణు, సుదర్శన్ రెడ్డి, గోపి, వెంకటేశ్, బాల్​రెడ్డి ఉన్నారు.

కొల్లాపూర్: పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి తెలిపారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొల్లాపూర్,పెద్ద కొత్తపల్లి,పెంట్లవెళ్లి, కోడేరు మండలాలకు చెందిన 200 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆర్డీవో నాగరాజు, తహసీల్దార్​ విష్ణువర్ధన్  రావు, మున్సిపల్  చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు పాల్గొన్నారు.