ఆదివాసీలు రాజకీయంగా ఎదగాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

ఆదివాసీలు రాజకీయంగా ఎదగాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్, వెలుగు: ఆదివాసీలు రాజకీయంగా ఎదగాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. బుధవారం కొల్లాపూర్  మండలం సోమశిల గ్రామంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఆదివాసీ కాంగ్రెస్  పార్టీ శిక్షణ తరగతులను రాష్ట్ర ఎస్టీ  కార్పొరేషన్  చైర్మన్  బెల్లయ్య నాయక్ తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఆదివాసీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.

రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజంలో కొందరు కులాన్ని, మతాన్ని వేరు చేసి రాజకీయంగా ఎదగకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ ఎదుగుదల, వనరులు, ఉపాధి అవకాశాలపై మూడు రోజుల శిక్షణ ఉంటుందని, దీనిని సద్వినియోగం చేసుకొని అన్నిరంగాల్లో ముందుకెళ్లాలని సూచించారు..

రథోత్సవంలో పాల్గొన్న మంత్రి..

పెంట్లవెల్లి వేంకటేశ్వరస్వామి రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవాన్ని ప్రారంభించి, ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. తేరు కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ఫౌండర్, ట్రస్ట్  చైర్మన్  జంగం జీవన్ కుమార్, సువర్ణ రామన్ గౌడ్​ పాల్గొన్నారు.