
నిజామాబాద్ జిల్లా భీంగల్ లో కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణిలో ఉద్రిక్తత నెలకొంది.స్టేజ్ పైనే మంత్రి జూపల్లి కృష్ణారావు,బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఒకరినొకరు వాగ్వాదానికి దిగారు. జూపల్లి మాట్లాడుతుండగా డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్,బీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.
మంత్రి జూపల్లి స్టేజ్ పై కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ చేస్తుండగా తులం బంగారం ఏమైందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. వెంటనే మంత్రి జూపల్లి కల్గజేసుకుని 10 ఏళ్లలో మీరు మూడెకరాల భూమి ఇచ్చారా?. నిరుద్యోగ భృతి ఇచ్చారా? గతంలో చేసిన ముఖ్యమంత్రుల అప్పు,10 ఎళ్లలో కేసీఆర్ చేసిన అప్పు సమానం. మేము వచ్చి 16 నెలలే అయింది ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తాం అని మంత్రి జూపల్లి బదులిచ్చారు.
దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం తలెత్తడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాలు బాహాబాహికి దిగారు. పోలీసులు కల్గజేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేయడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
అధికారుల నిర్లక్ష్యంతోనే చిరుత ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ ఉండి కూడా ప్రాణాలతో చిరుతను కాపాడలేక పోయారని మండిపడుతున్నారు►ALSO READ | కేసులకు భయపడేది లేదు.. నేషనల్ హెరాల్డ్ లో తప్పేం జరగలేదు: మహేశ్ కుమార్ గౌడ్