ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తాం :మంత్రి జూపల్లి కృష్ణారావు

ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తాం :మంత్రి జూపల్లి కృష్ణారావు
  • కొల్లాపూర్ లో 10 కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి జూపల్లి

కొల్లాపూర్, వెలుగు: నియోజకవర్గ ప్రజలకు, విద్యార్థులకు మెరుగైన ఆర్టీసీ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం కొత్తగా వచ్చిన పది బస్సులను, కొల్లాపూర్  నుంచి కల్వకుర్తి మీదుగా యాదగిరిగుట్టకు బయలుదేరుతున్న బస్సును జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజవర్గంలో ప్రజలు, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను మంత్రి పొన్నం ప్రభాకర్  దృష్టికి తీసుకెళ్లగా, ఒక ఎక్స్​ప్రెస్, 9 ఆర్డినరీ బస్సులను మంజూరు చేశారని తెలిపారు. నియోజకవర్గంలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు.

అనంతరం రంజాన్  సందర్భంగా పట్టణంలో ఖాదర్  బాషా దర్గాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు. మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ముక్కిడిగుండం–నార్లాపూర్  మధ్య పెద్దవాగుపై రూ.9 కోట్లతో నిర్మించిన హై లెవల్  వంతెనను మంత్రి ప్రారంభించారు. ఆర్డీవో బన్సీలాల్,  ఆర్ఎం సంతోష్, డీఎం ఉమాశంకర్  పాల్గొన్నారు.