ప‌‌‌‌‌‌‌‌ర్యాట‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌ అభివృద్ధికి నిధులివ్వండి

ప‌‌‌‌‌‌‌‌ర్యాట‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌ అభివృద్ధికి నిధులివ్వండి
  • కేంద్ర టూరిజం శాఖ మంత్రి షెకావత్​కు మంత్రి జూపల్లి విజ్ఞప్తి
  • ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియ‌‌‌‌‌‌‌‌ను వేగవంతం చేయాలని నితిన్ గడ్కరీకి రిక్వెస్ట్ 
    ​​​​​​

న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణ ప‌‌‌‌‌‌‌‌ర్యాట‌‌‌‌‌‌‌‌క రంగ అభివృద్ధికి నిధులివ్వాలని రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌‌‌‌‌‌‌‌ల్లి కృష్ణారావు కేంద్రాన్ని కోరారు. శ‌‌‌‌‌‌‌‌నివారం ఢిల్లీలో కేంద్ర ప‌‌‌‌‌‌‌‌ర్యాట‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ఆయన క్యాంపు ఆఫీసులో కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ‌‌‌‌‌‌‌‌లో టూరిజం అభివృద్ధికి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయని, కేంద్రం నిధులిస్తే టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామని కేంద్ర మంత్రికి వివరించారు.

భేటీ అనంతరం జూప‌‌‌‌‌‌‌‌ల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప‌‌‌‌‌‌‌‌ర్యాట‌‌‌‌‌‌‌‌కాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని ర‌‌‌‌‌‌‌‌కాల మార్గాల‌‌‌‌‌‌‌‌ను అన్వేషిస్తున్నామ‌‌‌‌‌‌‌‌న్నారు. ఎకో, వాట‌‌‌‌‌‌‌‌ర్ బాడీస్, టెంపుల్, హెల్త్ అండ్ వెల్నెస్ టూరిజానికి తెలంగాణ అనుకూలంగా ఉంద‌‌‌‌‌‌‌‌న్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వార్షిక బ‌‌‌‌‌‌‌‌డ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింద‌‌‌‌‌‌‌‌ని చెప్పారు. తెలంగాణ ప‌‌‌‌‌‌‌‌ర్యాట‌‌‌‌‌‌‌‌క అభివృద్ధికి.. కేంద్ర ప్రభుత్వ స‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌కారం కూడా అవ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ని, నిధులు కేటాయించాల‌‌‌‌‌‌‌‌ని గ‌‌‌‌‌‌‌‌జేంద్ర సింగ్ షెకావ‌‌‌‌‌‌‌‌త్ ను కోరిన‌‌‌‌‌‌‌‌ట్లు మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూత‌‌‌‌‌‌‌‌న ప‌‌‌‌‌‌‌‌ర్యాట‌‌‌‌‌‌‌‌క విధానం తీసుకువ‌‌‌‌‌‌‌‌చ్చి... తెలంగాణ‌‌‌‌‌‌‌‌ను దేశంలోనే మొద‌‌‌‌‌‌‌‌టి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామ‌‌‌‌‌‌‌‌ని పేర్కొన్నారు. 

ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ పనులు స్పీడప్ ​చేయాలి..

కృష్ణా నదిపై సోమశిల (తెలంగాణ)– సంగమేశ్వర (ఏపీ) మధ్య డబుల్ డెక్కర్ కేబుల్ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియ‌‌‌‌‌‌‌‌ను వేగ‌‌‌‌‌‌‌‌వంతం చేయాల‌‌‌‌‌‌‌‌ని కేంద్ర మంత్రి నితిన్ గ‌‌‌‌‌‌‌‌డ్కరీని మంత్రి జూప‌‌‌‌‌‌‌‌ల్లి కోరారు. షెకావత్ తో భేటీ అనంతరం ఆయన నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం, ఉమ్మడి మహబూబ్ నగర్ లోని వివిధ జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల గురించి సుధీర్ఘంగా చర్చించారు.

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.1,082.56 కోట్ల వ్యయంతో నిర్మించ త‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌పెట్టిన ఐకానిక్ తీగల వంతెన నిర్మాణ ప్రక్రియ వివిధ కార‌‌‌‌‌‌‌‌ణాలతో గ‌‌‌‌‌‌‌‌త రెండేండ్లుగా పెండింగ్ లో ఉంద‌‌‌‌‌‌‌‌ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నిర్మాణ ప‌‌‌‌‌‌‌‌నులు ప్రారంభ‌‌‌‌‌‌‌‌య్యేలా చ‌‌‌‌‌‌‌‌ర్యలు తీసుకోవాల‌‌‌‌‌‌‌‌ని నితిన్ గ‌‌‌‌‌‌‌‌డ్కరీని కోరారు.

ఈ వంతెన నిర్మాణంతో తెలుగు రాష్ట్రాల్లో పర్యావరణ, దేవాలయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా, రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మరింత సులువైన మార్గం ఏర్పడుతుందన్నారు. దీనిపై నితిన్ గ‌‌‌‌‌‌‌‌డ్కరీ సానుకూలంగా స్పందించిన‌‌‌‌‌‌‌‌ట్టు మంత్రి తెలిపారు. సెప్టెంబ‌‌‌‌‌‌‌‌ర్ నెలాఖ‌‌‌‌‌‌‌‌రులోగా టెండ‌‌‌‌‌‌‌‌ర్లు ప్రారంభ‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌య్యేలా చర్యలు తీసుకుంటామ‌‌‌‌‌‌‌‌ని హామీ ఇచ్చిన‌‌‌‌‌‌‌‌ట్టు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి జూపల్లి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.