SLBC టన్నెల్ ప్రమాదం: ఆ నలుగురు ఎక్కడున్నారో గుర్తించాం: మంత్రి జూపల్లి

SLBC టన్నెల్ ప్రమాదం: ఆ నలుగురు ఎక్కడున్నారో గుర్తించాం: మంత్రి జూపల్లి

SLBC టన్నెల్ ప్రమాదంలో టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికులను వెలికితీసేందుకు పనులు వేగంగా జరుగుతున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ర్యాడార్ ద్వారా నలుగురు కార్మికులను లొకేట్ చేసినట్లు తెలిపారు. నలుగురు ఎక్కడున్నారో గుర్తించామని మంత్రి ఆయన తెలిపారు.

మొత్తం 8 మంది కార్మికులలో నలుగురిని గుర్తించామని, మిగతా నలుగురు టీమీఎం మిషన్ అవతలి వైపున ఉన్నట్లు చెప్పారు. ఆదివారం (మార్చి 2) రాత్రి వరకు మిగతా నలుగురి ఆచూకీ లభ్యం అవతుందని మంత్రి తెలిపారు. పనుల్లో పురోగతి చాలా ఉందని, 150 మంది సింగరేణి కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. గ్యాస్ కట్టర్ల ద్వారా TBM మిషన్ మొత్తం కట్ చేశామని తెలిపారు. 

ALSO READ : మామునూర్ ఎయిర్ పోర్ట్ వద్ద ’క్రెడిట్’ ఫైట్.. బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట

టన్నెల్ ప్రమాదంపై రాజకీయాలు చేయడం తగదని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి అన్నారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ SLBC టన్నెల్ పనులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఇలాంటి ప్రమాదాన్ని రాజకీయం చేయాలనుకోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు.