- ఎమ్మెల్యే గణేశ్‌గుప్త వెల్లడి
నిజామాబాద్, వెలుగు: రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం నిజామాబాద్‌కు రానున్నట్లు నగర ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు.
కొత్త కలెక్టరేట్‌వద్ద నిర్మించిన ఐటీ హబ్, మున్సిపల్ భవనం, మినీ ట్యాంక్‌బండ్‌తో పాటు దుబ్బ, అర్సాపల్లి, వర్ని రోడ్లో నిర్మించిన శ్మశాన వాటికలను ప్రారంభిస్తారన్నారు. మధ్యాహ్నం మున్సిపల్ కార్మికులతో కలిసి లంచ్‌చేసి, సాయంత్రం పాలిటెక్నిక్ గ్రౌండ్లో నిర్వహించే సభలో ప్రసంగిస్తారన్నారు.