మూసీ ప్రజలను ఒప్పించేందుకు ప్రజా దర్బార్ పెట్టాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మూసీ ప్రజలను ఒప్పించేందుకు ప్రజా దర్బార్ పెట్టాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • ఆ తర్వాతే ఇండ్లు కూల్చాలి
  • సీఎం ప్రజల వద్దకు వస్తే..నేనూ వచ్చి మాట్లాడుతా..
  • అక్రమ నిర్మాణాలు కూల్చే హక్కు ప్రభుత్వానికి ఉన్నది
  • హైడ్రా పేరే కొత్తది.. చేసే పని మాత్రం పాతదేనని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: మూసీ ప్రక్షాళన కోసం ప్రజా దర్బార్ పెట్టి జనాలను ఒప్పించాలని, ఆ తర్వాతే ఇండ్లు కూల్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ‘‘సీఎం ప్రజల వద్దకు వస్తానంటే నేనూ వచ్చి ప్రజల తరఫున మాట్లాడుత. హైడ్రా అంటే భూతం కాదు.. రేవంత్ పెట్టిన పేరు మాత్రమే.. హైడ్రా కొత్తదేం కాదు.. అక్రమ నిర్మాణాలను కూల్చే హక్కు ప్రభుత్వానికి, జీహెచ్​ఎంసీకి ఉన్నది. కాకపోతే.. కాంగ్రెస్ దానికి హైడ్రా అని పేరు పెట్టింది’’ అని ఆయన అన్నారు. 

బీజేపీ స్టేట్ ఆఫీస్​లో మీడియాతో కిషన్​ రెడ్డి చిట్​చాట్ చేశారు. ‘‘గ్రేటర్ పరిధిలోని అన్ని డ్రైనేజీల మురుగు మూసీలోనే కలుస్తది. డ్రైనేజీ వ్యవస్థకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపించకుండా సుందరీకరణ ఎలా సాధ్యం? రిటైనింగ్ వాల్ కట్టి మూసీ సుందరీకరణ చేయొచ్చు. చాలా తక్కువ నిధులతో కేంద్ర ప్రభుత్వం గంగా నది సుందరీకరణ చేసింది. మూసీ సుందరీకరణకు రూ.లక్షన్నర కోట్లు కాంగ్రెస్ ఖర్చు పెడుతున్నది. అన్ని నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తది? హైడ్రాపై తొందరపాటు నిర్ణయాలు తగవు. పేదల ఇండ్లు కూల్చితే బ్యాంకులో ఉన్న అప్పులు ఎవరు కట్టాలి? బీఆర్ఎస్​తో మేము కాంప్రమైజ్ అయ్యే చాన్స్ లేదు”అని ఆయన తెలిపారు.

తుది నిర్ణయం నేనే తీస్కుంటా

పేదల ఇండ్లు కూల్చాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ ప్రభుత్వానికి చెప్పలేదని కిషన్ రెడ్డి అన్నారు. ‘‘ఏ అంశంపై అయినా తుది నిర్ణయం నేను తీసుకుంటా. కాంగ్రెస్ హయాంలోనే మూసీ పరీవాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు జరిగాయి. 40 ఏండ్లుగా ప్రజలు అక్కడే నివాసం ఉంటున్నరు. ప్రభుత్వమే వారికి అన్ని వసతులు కల్పించింది. ఇప్పుడేమో వాళ్లే ఇండ్లు కూల్చేస్తున్నరు. మూసీ పరీవాహక ప్రాంతంలో పేదలే ఉంటరు.

కూలగొట్టుడు అంత తేలిక కాదు’’అని కిషన్ రెడ్డి అన్నారు. ఈ నెల 5న హర్యానా ఎన్నికలు జరగగా.. 8న ఓట్ల లెక్కింపు జరిగింది. అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ.. 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీలో 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌‌‌‌కు 2019లో 31 సీట్లు రాగా.. ఈ సారి 37 సీట్లు వచ్చాయి. కాగా, కౌంటింగ్ సమయంలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్​పార్టీ ఆరోపించింది. కానీ, ఆ ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.