బంజార భాషకు గుర్తింపు తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బంజార భాషకు గుర్తింపు తెస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బషీర్​బాగ్, వెలుగు: గిరిజన సమాజాన్ని జాగృతం చేసేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు సంత్​శ్రీసేవాలాల్ మహారాజ్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. బంజారా ధార్మిక వ్యాప్తి మహాసంఘ్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో గురువారం జరిగిన సేవాలాల్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథి హాజరయ్యారు. దేశ చరిత్రలో గిరిజనులకు ప్రత్యేక స్థానం ఉన్నదని, విదేశీయుల దండయాత్ర నుంచి దేశాన్ని కాపాడే ప్రయత్నంలో ఆదివాసీల పాత్ర కీలకమైనదన్నారు. 

సేవాలాల్ జయంతి వేడుకలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించిందని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. అలాగే బంజార భాషకు గుర్తింపు ఇవ్వాలని, ఆ దిశగా కృషి చేస్తామన్నారు. ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, సేవాలాల్ ఉత్సవాల సమితి చైర్మన్ డాక్టర్ కల్యాణ్ నాయక్, మాజీ మంత్రి అమర్సింగ్ తిరాపత్ పాల్గొన్నారు.