హైదరాబాద్: దేశంలో ఎక్కడా బతుకమ్మ పండుగ ఉండదని.. బతుకమ్మ మన తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీ ఆధ్వర్యంలో సాగర్ సొసైటీ గ్రౌండ్స్‌లో ఇవాళ (అక్టోబర్ 5) బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికి దేవి నవరాత్రులు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రకరకాల పూలతో బతుకమ్మ ను అలంకరించుకొని అమ్మవారిని కొలిచే సంప్రదాయం బతుకమ్మ పండుగని అన్నారు.
ALSO READ | తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి నిదర్శనం బతుకమ్మ: మంత్రి సీతక్క
తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగ మంచి వాతారణంలో జరుపుకుంటామన్నారు. గతంలో నిజాంకు వ్యతిరేకంగా పాటలు పాడుతూ బతుకమ్మ జరుపుకునేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాని మోడీ తరపున రాష్ట్ర ప్రజలకు నవరాత్రి, బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి ఆశీసులు, దీవెనలు రాష్ట్రప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నాని అన్నారు.