తెలంగాణలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ నేతల మధ్య సవాల్ ప్రతి సవాల్ నడుస్తోంది. దమ్ముంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచి చూపించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. తాను రాజీనామా చేసి మల్కాజ్ గిరి ఎంపీకి పోటీ చేస్తా.. సీఎం పదవికి రాజీనామా చేసి మల్కాజ్ గిరి ఎంపీకి పోటీ చేసి గెలవాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే..
లేటెస్ట్ గా కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ చేశారు. తాను నల్గొండలో రిజైన్ చేస్తా.. కేటీఆర్ సిరిసిల్లలో రిజైన్ చేయాలన్నారు.. తాను సిరిసిల్లలో పోటీ చేస్తా.. ఒక వేళ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కేటీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీని పార్టీ క్లోజ్ చేస్తారా అని సవాల్ విసిరారు. కేటీఆర్ కు టెక్నీకల్ నాలెడ్జ్ లేదని విమర్శించారు . కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ALSO READ :- కేసీఆర్కు షాక్ : బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్
కేటీఆర్ ఒక చిన్న పిలగాడు .. తన స్థాయి కేటీఆర్ ది కాదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కు క్యారెక్టర్ లేదు... లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయి.. తనకు క్యారెక్టర్ ఉంది కానీ డబ్బుల్లేవన్నారు కోమటిరెడ్డి. కేటీఆర్ సిరిసిల్లలో 200 కోట్లు ఖర్చు చేసి 30 వేల మెజారిటీతో గెలుస్తాడా?..తానైతే అలా గెలిస్తే రాజీనామా చేసేవాడినని చెప్పారు కోమటిరెడ్డి.