గండ్ర వెంకటరమణా రెడ్డే ఈ హత్య చేయించిండు: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

గండ్ర వెంకటరమణా రెడ్డే  ఈ హత్య చేయించిండు: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
  • రాజలింగమూర్తి హత్యను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలె
  • కేసు విచారణను సీబీసీఐడీ కి అప్పగించాలె
  • కేసీఆర్ తో  కిరాయి హత్యలు చేయించడం తప్ప ఇంకా ఏం కాదు
  •  పదేండ్లు దోచుకొని ఇప్పుడు హత్యలకు దిగుతుండ్రా
  •  వామన్ రావు దంపతులను చంపినోళ్లకే మీరు టికెట్ ఇవ్వలే
  • గండ్ర వెంకటరమణారెడ్డే హత్య చేయించిండు
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ 

హైదరాబాద్:  బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించిన రాజలింగమూర్తిని దారుణంగా హత్య చేశారని, ఈ హత్య వెనుక మాజీ ఎమ్మల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హస్తం ఉందని, ఆయనే కిరాయి గూండాలతో మర్డర్ చేయించారని రోడ్లు  భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఫ్యామిలీ అక్రమాలను బయటపెడితే చంపేస్తారా..? అని ప్రశ్నించారు. పదేండ్లు దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు హత్యా రాజకీయాలు ప్రారంభించిందని అన్నారు.

రాజలింగమూర్తి హత్య కేసును సీబీసీఐడీ విచారణకు అప్పగించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు సత్వరమే శిక్ష పడేలా చూడాలని అన్నారు. తెలంగాణలో హత్యా రాజకీయాలకు తావు లేదని అన్నారు. కాళేశ్వరంలో కేసీఆర్ కు దోషిగా శిక్ష పడుతుందని కేసీఆర్, కేటిఆర్ హత్య చేయించారని రాజలింగమూర్తి కూతురు, భార్య చెబుతున్నారని ఆరోపించారు. అడ్వొకేట్ వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితులకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. వరంగల్ లో ఎంపీడీవోను బీఆర్ఎస్ వాళ్లే హత్య చేశారని అప్పటి సీపీ రంగనాథ్ చెప్పారని గుర్తు చేశారు.

ALSO READ | మేడిగడ్డ కేసు గెలుస్తామనే నా భర్తను హత్య చేశారు: రాజలింగం మూర్తి భార్య సరళ

లగచర్లలోనూ కలెక్టర్ పై హత్యా యత్నానికి పాల్పడింది బీఆర్ఎస్ కు చెందిన సురేశ్ అని అన్నారు. ఆయనపై రౌడీ షీట్ ఉందని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగకుండా ఉండటమే బీఆర్ఎస్ లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని కేసీఆర్ అంటున్నారని, హత్యలు  రాజకీయాలే మీ గ్రాఫా..? అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు.  కిరాయి హత్యలు చేయించడం తప్ప కేసీఆర్ తో ఏమీ కాదని అన్నారు. రాజలింగమూర్తి హత్యలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, గండ్ర వెంకటరమణారెడ్డి పాత్ర కీలకంగా ఉందని ఆరోపించారు.  చక్రధర్ గౌడ్ కు రక్షణఅవినీతిపై పోరాడే వారికి తమ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. హరీశ్ రావు మీద పోరాటం చేస్తున్న చక్రధర్ గౌడ్ కు రక్షణ కల్పిస్తామని మంత్రి చెప్పారు. తెలంగాణను పదేండ్లు దోచుకొని ఎదురు తిరిగిన వాళ్లను చంపేస్తారా..? అని ప్రశ్నించారు.