మర్యాద ఇచ్చి మాట్లాడాలి కేటీఆర్ : స్పీకర్ సూచనతో తగ్గిన ఎమ్మెల్యే

మర్యాద ఇచ్చి మాట్లాడాలి కేటీఆర్ : స్పీకర్ సూచనతో తగ్గిన ఎమ్మెల్యే

తెలంగాణ అసెంబ్లీ హాట్ హాట్ గా సాగుతుంది. బయట ఎలా ఉన్నా.. బయట ఎలా మాట్లాడినా.. సభ అంటే మర్యాద, గౌరవం ఉండాలి కదా.. సభలో మాటతీరు, మర్యాద అనేది ముఖ్యం కదా.. ఇదే విషయం ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు వచ్చింది. 

అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కేటీఆర్.. ఏకవచనాలతో మాట్లాడటంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యారు., సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఏకవచనంతో సంబోధిస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్. 

కేటీఆర్ మాటలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎంను.. అసెంబ్లీలో ఏకవచనంతో ఎలా సంబోధిస్తారంటూ ప్రశ్నించారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. కేటీఆర్ ఏకవచన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ ను డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.

Also Read :- అసెంబ్లీలో మంత్రి తుమ్మల vs కేటీఆర్

ఈ అంశంపై స్పందించారు స్పీకర్ ప్రసాద్ కుమార్. సీఎం అంటే సభాధ్యక్షులు అని.. సీఎం స్థాయిని వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు సభలో హుందాగా... మర్యాద ఇచ్చి మాట్లాడాలంటూ కేటీఆర్ కు సూచించారు స్పీకర్.

స్పీకర్ సూచనలతో.. స్పీచ్ కొనసాగించిన కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిగారు అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు. ఏదిఏమైనా వ్యక్తిగతంగా ఎన్ని ఉన్నా.. ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి అంటూ కేటీఆర్ పై మండిపడుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.