ఏపీ ఆధీనంలోని R&B ఆస్తులు స్వాధీనం చేసుకోవానికి చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా  హైదరాబాద్ 10ఏళ్ల కాలం జూన్ 2, 2024తో పూర్తి అయ్యింది. దీంతో హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆర్అండ్ బీ శాఖ భవనాలను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియపై రోడ్లు మరియు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం తన ఛాంబర్ లో ఆర్అండ్ బీ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. 

రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ఉన్న లేక్ వ్యూ అథితి గృహం, మినిస్టర్స్ క్వార్టర్స్, ఆదర్శనగర్, బషీర్ బాగ్, కుందన్ బాగ్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేల నివాస సముదాయాలతో పాటు గ్రీన్ ల్యాండ్స్, మంజీర అతిథి గృహాలతో వంటి వివిధ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి కోమటి రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, జాయింట్ సెక్రటరీ హరీష్, ఈఎన్ సీ గణపతి రెడ్డి, సీఈ మధుసూధన్ రెడ్డి, మోహన్ నాయక్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.Hyderabad joint capital, Telangana and