అధికారంలో ఉండి.. ప్రజాదనం దోచుకున్న బీఆర్ఎస్ నేతలను వదిలేది లేదని.. జైలుకు పంపించటం ఖాయం అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్, కవిత తర్వాత జైలుకు పోయేది ఎవరైనా ఉన్నారా అంటే.. అది మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అని వార్నింగ్ ఇచ్చారు మంత్రి. ఎన్ని కుట్రలు చేసినా విజిలెన్స్, సిట్టింగ్ జడ్జితో విచారణను అడ్డుకోలేరని.. విచారణ తర్వాత జగదీశ్ రెడ్డి జైలుకు పోవటం ఖాయం అన్నారు మంత్రి కోమటిరెడ్డి. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లలో అక్రమాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కరెంట్ కొనుగోళ్లలో అవినీతి భయటపడుతుందన్నారు. విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్ కుటుంబం.. విచారణ తర్వాత జైలుకు పోవటం ఖాయమని జోస్యం చెప్పారు మంత్రి.
పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్క్లీన్ స్వీప్ చేస్తుందని.. బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు రావన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్ పార్టీలోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారంటూ బాంబ్ పేల్చారు మంత్రి కోమటిరెడ్డి.
కేసీఆర్ కుటుంబంలో బావ, బామ్మర్థులు తన్నుకుంటుంటే.. జగదీష్‌రెడ్డి బ్రోకర్‌లా పని చేశాడంటూ చురకలు వేశారు. ఇలాంటి చిల్లర వ్యక్తి.. ప్రజల కోసం బతికే తనపై ఆరోపణలు చేయడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. తెలంగాణ కోసం మంత్రి పదవులను వదులుకున్నానని.. జగదీష్‌రెడ్డి మంత్రి పదవి కోసం కేసీఆర్ చెప్పినట్లు గంగిరెద్దులా ఆడాడంటూ విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి.